Honda SP 160: హోండా నుంచి ఎస్‌పీ160 బైక్ వచ్చేసింది, హైదరాబాద్‌లో దీని ధర ఎంతంటే..
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా ఇండియా.. దేశీయ విపణిలోకి కొత్త బైకు ‘ఎస్‌పీ160’ని విడుదల చేసింది. రెండు రకాల్లో లభించనున్న ఈ హోండా ఎస్‌పీ 160 మాడల్ సింగిల్ డిస్క్ ధర రూ. 1,21,951 కాగా, డబుల్ డిస్క్ ధర రూ. 1,27,956గా నిర్ణయించింది. అయితే ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా ఇండియా.. దేశీయ విపణిలోకి కొత్త బైకు ‘ఎస్‌పీ160’ని విడుదల చేసింది. రెండు రకాల్లో లభించనున్న ఈ హోండా ఎస్‌పీ 160 మాడల్ సింగిల్ డిస్క్ ధర రూ. 1,21,951 కాగా, డబుల్ డిస్క్ ధర రూ. 1,27,956గా నిర్ణయించింది. అయితే ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ త్సుత్సుము ఒటాని మాట్లాడుతూ..కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా ఈ నూతన ఎస్‌పీ160ని రూపొందించినట్లు, బ్లూటూత్ కనెక్ట్‌తో టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉండటంతో నావిగేషన్ ఆధారంగా తాము వెళ్లాలనుకున్న చోటికి సులభంగా చేరుకోవచ్చునన్నారు.హై-టెక్ ఫీచర్‌తోపాటు అధిక పనితీరుతో రూపొందించిన ఈ బైకు కస్టమర్లకు నూతన రైడింగ్ అనుభవం కల్పించేవిధంగా తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇక హైదరాబాద్ లో దీని ధర లక్షా 35 వేల వరకు ఉండనుంది.
2025 Honda SP 160 launched