Tesla Crashes Into Divider: కెనడాలో టెస్లా కార్లు ఢీకొని ఒక్కసారిగా ఎగసిన మంటలు, మంటల్లో నలుగురు భారతీయులు సజీవ దహనం
టొరంటో సమీపంలో గురువారం అర్ధరాత్రి తర్వాత కారు డివైడర్‌ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.
కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.‘టెస్లా’ కారు క్రాష్ అయి నలుగురు భారతీయులు చనిపోయారు. టొరంటో సమీపంలో గురువారం అర్ధరాత్రి తర్వాత కారు డివైడర్‌ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరణించిన వారిలో గుజరాత్‌లోని గోద్రాకు చెందిన 30 ఏళ్ల కేతా గోహిల్, 26 ఏళ్ల నిల్ గోహిల్ ఉన్నారు. వారితో పాటు ఉన్న మరో ఇద్దరు వివరాలు తెలియాల్సి ఉంది.
అదే కారులో ప్రయాణిస్తున్న మరో యువతిని స్థానికులు కాపాడారు. కారు నుంచి బయటకు వచ్చి, వాహనదారుల సాయం కోరినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఆ యువతికి ప్రాణపాయం తప్పినట్లు అధికారుల తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు పలువురు కారు అద్దాలను పగలగొట్టి సాయం చేసే ప్రయత్నం చేసినట్లు వివరించారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)