Andhra Pradesh: అసెంబ్లీకి పోనీ వాళ్ళు ఎవరైనా రాజీనామా చేయాల్సిందే, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..
వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లేది లేదని నిర్ణయం తీసుకోవడంపై స్పందించారు. అసెంబ్లీకి పోనీ వాళ్ళు ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. అది జగన్ మోహన్ రెడ్డి అయినా... వైసిపి ఎంఎల్ఏ లు అయినా..ఎవరైనా రాజీనామా చేయాలి. అసెంబ్లీ వెళ్ళే ధైర్యం లేకపోతే పదవులు ఎందుకు అని అన్నారు.
సామాజిక మాధ్యమాలు సమాజానికి మంచి చేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ‘‘కొందరు సైకోలు, సైకో పార్టీలతో కలిసి సోషల్ మీడియాను భ్రష్టుపట్టించారు. మానవ సంబంధాలు, రక్త సంబంధాలు మరిచి మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. తల్లి, చెల్లి అనే ఇంగిత జ్ఞానం లేకుండా పోస్టులు పెట్టారు. మహిళలపై అసభ్యకర పోస్టులతో రాక్షసానందం పొందారు. సోషల్ మీడియా బాధితుల్లో నేనూ ఉన్నా. పరువు, ప్రతిష్ఠ దెబ్బతీసేలా పోస్టులు పెట్టారు. పైశాచిక ఆనందం పొందేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
తాజాగా వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లేది లేదని నిర్ణయం తీసుకోవడంపై స్పందించారు. అసెంబ్లీకి పోనీ వాళ్ళు ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. అది జగన్ మోహన్ రెడ్డి అయినా... వైసిపి ఎంఎల్ఏ లు అయినా..ఎవరైనా రాజీనామా చేయాలి. అసెంబ్లీ వెళ్ళే ధైర్యం లేకపోతే పదవులు ఎందుకు అని అన్నారు.
అసెంబ్లీ కి పోనీ వాళ్ళు ఎవరైనా రాజీనామా చేయాలి