YS Jagan Slams CM Chandrababu Naidu Over TDP Cadre Attacks on YSRCP Activists

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు.. బహుశా స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వారం రోజులుగా జరుగుతున్న వైఎస్సార్‌సీపీ యాక్టివిస్టుల అరెస్టుల పర్వంపై గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంపై స్పందించారు.

ప్రభుత్వం తప్పుడు కేసులు పెడితే ఈ నంబర్లకు ఫోన్ చేయండి, మీ తరపున పోరాటం చేయడానికి వైసీపీ సిద్ధంగా ఉందని తెలిపిన జగన్

అసెంబ్లీలో మాకు మైక్‌ ఇస్తే.. వాళ్లను ఎక్కడ ఎండగడతామని కూటమి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చినవాళ్లను ప్రతిపక్షంగా గుర్తించరా?. సమస్యలు చెప్పనీయకుండా ఉండేందుకే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు?. ప్రతిపక్ష నాయకుడికి మైక్‌ ఇస్తేనే ప్రజా సమస్యలు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం కాబట్టి మైక్‌ ఇవ్వరు.

అధికారంలోకి వచ్చాక ఏ పోలీసును వదలం, సప్త సముద్రాల అవతల ఉన్నా వెతికి మరీ పట్టుకుంటాం, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీలో మాకు మైక్‌ ఇచ్చే పరిస్థితి లేదు. మైక్‌ ఇవ్వనప్పుడు అసెంబ్లీకి వెళ్లి ఏం ఉపయోగం. అందుకే ఇక నుంచి మీరే నా స్పీకర్లు’’ అని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ అన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకొస్తాం. మీడియా సమక్షంలోనే ప్రతిపక్షంలా వ్యవహరిస్తూ.. ప్రజాసమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తాను’’ అని అన్నారు.