Pawan Kalyan Meet Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పవన్‌ కల్యాణ్‌ మర్యాదపూర్వక భేటీ, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సమావేశం

Pawan Kalyan meet Amit Shah (photo-x/Pawan Kalyan)

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఇవాళ (బుధవారం) సాయంత్రం ఏపీ క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి డిప్యూటీ సీఎం నేరుగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ్నుంచి అమిత్ షా ఇంటికి వెళ్లారు. అనంతరం ఆయనతో పవన్ మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి అమిత్ షాతో పవన్ ఏకాంతంగా భేటీ అయ్యారు.

వైసీపీ కార్యకర్తలు భయపడకండి, కేసులు పెడితే పూర్తి న్యాయ సహకారం అందిస్తామని తెలిపిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి

ఇరువురి మధ్య దాదాపు 15 నిమిషాల పాటు పలు అంశాలపై చర్చ జరిగింది. సహకార శాఖతోపాటు పంచాయతీ రాజ్, అటవీ పర్యావరణ శాఖల నుంచి ఏపీకి నిధుల కేటాయించాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన ఇతర నిధులపైనా మాట్లాడినట్లు సమాచారం.

Pawan Kalyan meet Amit Shah

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement