Balineni vs Chevireddy: చెవిరెడ్డికి కౌంటర్ విసిరి బాలినేని, నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని వెల్లడి, ఎవరి మెప్పుకోసం నేను పనిచేయట్లేదని మండిపాటు
వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో బాలినేనికి ఉన్న స్వేచ్ఛ ఎవరికీ లేదు.. ఇతర పార్టీనేతలతో విదేశాలకు వెళ్లేంత స్వేచ్ఛ ఇక్కడ ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఇతర పార్టీలతో మాట్లాడటానికి కూడా స్వేచ్ఛ ఉండదని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యలపై బాలినేని స్పందించారు.
వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో బాలినేనికి ఉన్న స్వేచ్ఛ ఎవరికీ లేదు.. ఇతర పార్టీనేతలతో విదేశాలకు వెళ్లేంత స్వేచ్ఛ ఇక్కడ ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఇతర పార్టీలతో మాట్లాడటానికి కూడా స్వేచ్ఛ ఉండదని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యలపై బాలినేని స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్‌రెడ్డి మరణించాక మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదులుకున్నా. చంద్రబాబు, పవన్ మెప్పుకోసమే నేను మాట్లాడుతున్నానని విమర్శిస్తున్నారు. ఎవరి మెప్పుకోసం నేను పనిచేయట్లేదని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. తిట్టేవాళ్లకే టికెట్లు ఇస్తామనే సంప్రదాయం ఎవరు కొనసాగిస్తున్నారో తెలుసని మండిపడ్డారు.
Balineni Srinivas Reddy vs Chevireddy
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)