Andhra Pradesh: వైసీపీ సంచలన నిర్ణయం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు కీలక ప్రకటన, కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక పాలనపై మండిపాటు

ఈ ఎన్నిక ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికొదిలేసింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు.

Perni Nani (Phoot-X/Video Grab)

ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్న కారణంగా తాము పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది.ఈ మేరకు వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం మీడియాతో మాట్లాడారు. ‘కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎన్నిక ఉంది. ఈ ఎన్నిక ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికొదిలేసింది. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. టీడీపీ నేతలు ఎన్ని అఘాయిత్యాలు చేసినా పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం’ అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్‌సీపీలో ఉండండి, జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు, ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదని మండిపాటు

Here's YSRCP Leaders Press Meet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)