Andhra Pradesh: వీడియో ఇదిగో, రియల్దర్ పై చేయి చేసుకున్న గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్, తన ఇంటికి వచ్చి దౌర్జన్యానికి దిగాడని ఆరోపిస్తున్న బాధితుడు

సివిల్ వ్యవహారంలో విజయవాడ గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించిన వీడియో వెలుగులోకి వచ్చింది. గుణదలలో ఎస్‌ఎల్వీ కైలాస్ హైట్స్, రియల్ ఎస్టేట్ యజమాని దేవినేని శ్రీహరి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది.

Vijayawada Gundala CI Srinivas (photo-Video Grab)

సివిల్ వ్యవహారంలో విజయవాడ గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించిన వీడియో వెలుగులోకి వచ్చింది. గుణదలలో ఎస్‌ఎల్వీ కైలాస్ హైట్స్, రియల్ ఎస్టేట్ యజమాని దేవినేని శ్రీహరి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. తమ గోడను కూలగొట్టారంటూ ఎస్‌ఎల్వీ యజమాని ఫిర్యాదు ఆధారంగా అక్టోబర్ 23న దేవినేని శ్రీహరిపై గుణదలలో కేసు నమోదు చేశారు. ఆ తరువాత సీఐ శ్రీనివాస్ ఏకంగా దేవినేని శ్రీహరి ఇంటికి వెళ్లి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వ్యక్తిగత కక్షతోనే సీఐ దాడికి పాల్పడ్డారని, రౌడీ షీట్ తెరుస్తానని బెదిరించారని దేవినేని శ్రీహరి ఆరోపిస్తున్నారు. సివిల్ వివాదంలో సీఐ తలదూర్చడంపై సర్వాత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ పేరుతో అన్ని వర్గాలను మోసం చేశారు, ఏపీలో చీకటి రోజులు నడుస్తున్నాయని మండిపడిన జగన్

Gunadala-CI-Vasireddy-Srinivas-attacked on Real Estate Businessman

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement