Asha Sharma Dies at 88: ఆదిపురుష్‌ సినిమాలో శబరి పాత్రను పోషించిన ప్రముఖ నటి ఆశా శర్మ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చేసుకుంది. ప్రముఖ నటి ఆశా శర్మ(88) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆశాశర్మ..ఆదివారం ఉదయం తుదిశ్వాస విడినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. 13 ఏళ్ల వయసులోనే వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు.

Asha Sharma (Photo Credits: X)

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చేసుకుంది. ప్రముఖ నటి ఆశా శర్మ(88) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆశాశర్మ..ఆదివారం ఉదయం తుదిశ్వాస విడినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. 13 ఏళ్ల వయసులోనే వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత నటిగా మారి 1920, హమ్‌కో తుమ్సే ప్యార్ హై, హమ్ తుమ్హారే హై సనమ్‌తో పాటు మొత్తం 40 పైగా సినిమాల్లో నటించింది.  సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ మళయాల నటుడు నిర్మల్‌ బెన్నీ కన్నుమూత

ధర్మేంద్ర, హేమమాలిని మూవీ ‘దో దిశాయీన్‌’ మూవీలోనూ అద్భుత నటనను కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. చివరగా ప్రభాస్‌ రాముడిగా నటించిన ఆదిపురుష్‌ సినిమాలో శబరి పాత్రను పోషించింది. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. ‘కుంకుమ్ భాగ్య’, ‘మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ’, ‘ఏక్ ఔర్ మహాభారత్’ లాంటి సీరియల్స్‌తో కీలక పాత్రలు పోషించింది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement