Assam Acid Attack: అస్సాంలో మహిళపై యాసిడ్ దాడి, చావు బతుకుల్లో బాధితురాలు, డబ్బుల విషయమై తలెత్తిన వివాదంతో దారుణానికి పాల్పడిన వ్యాపారి

అస్సాంలో మహిళపై యాసిడ్‌ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. అస్సాంలోని ధేకియాజులిలోని రాఖ్యస్మారి రోడ్డు వద్ద ఆదివారం 3 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇద్దరూ ఒకరికొకరు పరిచయస్తులే, కొన్ని రోజులు సహజీవనం కూడా చేశారు.

Representational Image | (Photo Credits: PTI)

అస్సాంలో మహిళపై యాసిడ్‌ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. అస్సాంలోని ధేకియాజులిలోని రాఖ్యస్మారి రోడ్డు వద్ద ఆదివారం 3 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇద్దరూ ఒకరికొకరు పరిచయస్తులే, కొన్ని రోజులు సహజీవనం కూడా చేశారు. గత కొద్దిరోజులుగా ఇరువురి మధ్య డబ్బుల విషయమై వివాదం తలెత్తింది.ఈ నేపథ్యంలోనే నిందితుడు ఆ 30 ఏళ్ల మహిళపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను తేజ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దాడికి పాల్పడిన నిందితుడు వ్యాపారి వాస్తుకర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సూపరింటెండెంట్‌ బిశ్వ శర్మ తెలిపారు.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement