Uttar Pradesh: వీడియో ఇదిగో, బాలుడి కడుపులో 56 రకాల ఇనుప వస్తువులు, ఆపరేషన్ ద్వారా తొలగించిన వైద్యులు, మరుసటి రోజు బాలుడు మృతి
అయితే ఆ బాలుడు మాత్రం ఈ లోకాన్ని విడిచాడు. ఘటన వివరాల్లోకెళితే.. యూపికీ చెందిన చెందిన పదిహేనేండ్ల బాలుడు ఆదిత్య స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు
హత్రాస్ కు చెందిన పదిహేనేండ్ల బాలుడు కడుపులో నుంచి వైద్యులు 56 రకాల ఇనుప వస్తువులను బయటకు తీసారు. అయితే ఆ బాలుడు మాత్రం ఈ లోకాన్ని విడిచాడు. ఘటన వివరాల్లోకెళితే.. యూపికీ చెందిన చెందిన పదిహేనేండ్ల బాలుడు ఆదిత్య స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కొంతకాలంగా ఆ కుర్రాడు కడుపునొప్పితో బాధపడుతున్నాడు. రోజురోజుకూ నొప్పి తీవ్రం కావడంతో పాటు శ్వాస ఆడకపోవడంతో తల్లిదండ్రులు ఆదిత్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు స్కానింగ్ చేసి చూడగా అతని పొట్టలో వివిధ వస్తువులు కనిపించాయి. వెంటనే ఆపరేషన్ చేసి కడుపులో నుంచి ఏకంగా 56 వస్తువులను వెలికి తీశారు.
వాటిలో బ్యాటరీలు, బ్లేడ్, మొలలు, గోర్లతో పాటు చిన్న చిన్న ఇనుప వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ ఆదిత్య నోటితో మింగాడని వైద్యులు భావిస్తున్నారు. అయితే, ఆదిత్య గొంతుకు కానీ, ప్రేగులకు కానీ ఎలాంటి గాయం కాకపోవడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆదిత్యను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని వైద్యులు తెలిపారు. ఈ నెల 27 న ఢిల్లీలోని సప్ధర్ జంగ్ ఆసుపత్రిలో ఆదిత్యకు ఆపరేషన్ చేయగా.. ఆ మరుసటి రోజు ఆదిత్య చనిపోయాడని తల్లిదండ్రులు వివరించారు.
56 Metal Objects Removed From UP Teen's Stomach
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)