Viral Video: వీడియో ఇదిగో, బీఎండ‌బ్ల్యూ కారు అద్దాలు పగులగొట్టి రూ.13.75 ల‌క్ష‌ల‌ దోచుకెళ్లిన దుండగులు, సీసీటీవీ కెమెరాల్లో దొంగతనం రికార్డు

బెంగ‌ళూరులో పార్కింగ్ చేసిన బీఎండ‌బ్ల్యూ కారులో నుంచి రూ. 13.75 ల‌క్ష‌ల‌ను గుర్తు తెలియ‌ని ఇద్ద‌రు దుండగులు అప‌హ‌రించారు. ఈ చోరీ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బీఎండ‌బ్ల్యూ ఎక్స్5 అనే కారును సోంపుర‌లోని స‌బ్ రిజిస్ట్రార్ వ‌ద్ద పార్కింగ్‌లో నిలిపారు.

BMW Window broken by 2 men to rob Rs 13.75 lakh cash near sub-registrar's office in Sompura

బెంగ‌ళూరులో పార్కింగ్ చేసిన బీఎండ‌బ్ల్యూ కారులో నుంచి రూ. 13.75 ల‌క్ష‌ల‌ను గుర్తు తెలియ‌ని ఇద్ద‌రు దుండగులు అప‌హ‌రించారు. ఈ చోరీ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బీఎండ‌బ్ల్యూ ఎక్స్5 అనే కారును సోంపుర‌లోని స‌బ్ రిజిస్ట్రార్ వ‌ద్ద పార్కింగ్‌లో నిలిపారు. అయితే బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు దుండగుల్లో, ఒక‌రు డ్రైవ‌ర్ వైపు ఉండే కారు అద్దాల‌ను ప‌గుల‌గొట్టాడు. క్ష‌ణాల్లోనే కారులోకి వంగి.. ఓ క‌వ‌ర్‌ను అప‌హ‌రించారు. అనంత‌రం బైక్‌పై ఇద్ద‌రు దుండ‌గులు ప‌రారీ అయ్యారు.

కారు య‌జ‌మాని వ‌చ్చి చూడగా, క్యాష్ క‌వ‌ర్ క‌నిపించ‌క‌పోవ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించారు. ఇద్ద‌రు వ్య‌క్తులు ముఖాల‌కు మాస్కులు ధ‌రించారు. బైక్ న‌డిపే వ్య‌క్తి హెల్మెట్ ధ‌రించాడు. కారులో ఉన్న రూ. 13.75 ల‌క్ష‌ల‌ను ఎత్తుకెళ్లార‌ని బాధితుడు పోలీసుల‌కు తెలిపారు. దొంగ‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

BMW Window broken by 2 men to rob Rs 13.75 lakh cash near sub-registrar's office in Sompura

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now