Bharat Drone Mahotsav 2022: డ్రోన్‌ను ఎగరవేసిన ప్రధాని మోదీ, పరిశ్రమల రంగంలో భద్రత, నిఘా కోసం ఉద్దేశించిన డ్రోన్ ఇది
ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించిన డ్రోన్‌ను ఎగురవేశారు. పరిశ్రమల రంగంలో భద్రత, నిఘా కోసం ఉద్దేశించిన డ్రోన్ ఇది. ఈ ఎగ్జిబిషన్‌లో 70కిపైగా ఎగ్జిబిటర్లు పాల్గొని వివిధ సందర్భాల్లో ఉపయోగించే డ్రోన్లను ప్రదర్శించారు.
బెంగళూరుకు చెందిన ఫుల్ స్టాక్ డ్రోన్ టెక్నాలజీ కంపెనీ ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్ డ్రోన్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2022 (Drone Festival of India 2022)లో పాల్గొంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA), డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DFI) కలిసి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాయి. రెండు రోజులపాటు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్ రేపటి (శనివారం)తో ముగియనుంది. ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించిన డ్రోన్‌ను ఎగురవేశారు.
పరిశ్రమల రంగంలో భద్రత, నిఘా కోసం ఉద్దేశించిన డ్రోన్ ఇది. ఈ ఎగ్జిబిషన్‌లో 70కిపైగా ఎగ్జిబిటర్లు పాల్గొని వివిధ సందర్భాల్లో ఉపయోగించే డ్రోన్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ.. ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశాన్ని గ్లోబల్ డ్రోన్ హబ్‌గా మార్చాలనే ఆకాంక్షను వెల్లడించారు. ఈ విజన్‌ను సాకారం చేసేందుకు భారత ప్రభుత్వం పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తుందన్నారు.