Bihar: బీహార్‌లో రైలు ప్రమాదం, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు తప్పిన భారీ ముప్పు, రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు

బీహార్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు భారీ ముప్పు తప్పింది. సమస్తిపూర్ వద్ద ఈ రైలు ఇంజిన్, రెండు బోగీల నుంచి ఇతర బోగీలు విడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనపై నిపుణుల బృందం దర్యాఫ్తును ప్రారంభించింది.

Coaches of Sampark Kranti Express Detach in Samastipur, No Injuries Reported

బీహార్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలుకు భారీ ముప్పు తప్పింది. సమస్తిపూర్ వద్ద ఈ రైలు ఇంజిన్, రెండు బోగీల నుంచి ఇతర బోగీలు విడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనపై నిపుణుల బృందం దర్యాఫ్తును ప్రారంభించింది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు దర్బంగ నుంచి న్యూఢిల్లీకి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.  పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, తప్పిన పెను ప్రమాదం,నిర్లక్ష్యమే కారణమా?.. వీడియో వైరల్

ప్రమాద సమయంలో రైలు తక్కువ వేగంతో వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సుమారు గంట పాటు శ్రమించి విడిపోయిన బోగీలను ఇంజిన్‌కు కనెన్ట్‌ చేసినట్లు తూర్పు మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ చంద్ర తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలను నిపుణుల బృందం పరీశీలిస్తున్నట్లు వెల్లడించారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement