Cop Thrashes Dalit Woman: వీడియో ఇదిగో, దళిత మహిళని కర్రతో దారుణంగా చితకబాదిన పోలీస్ అధికారి,ఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు

బీహార్‌ (Bihar)లో ఓ దళిత మహిళని (Dalit woman) పోలీసు అధికారి (Bihar police) చితకబాదిన దారుణ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సీతామర్హి ప్రాంతంలో చోటు చేసుకోగా వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియో ప్రకారం.. ఓ కిడ్నాప్‌ కేసులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Dalit Woman in Public View at Surasand Market Area in Sitamarhi

బీహార్‌ (Bihar)లో ఓ దళిత మహిళని (Dalit woman) పోలీసు అధికారి (Bihar police) చితకబాదిన దారుణ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన సీతామర్హి ప్రాంతంలో చోటు చేసుకోగా వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. వీడియో ప్రకారం.. ఓ కిడ్నాప్‌ కేసులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలకు చెందిన ఇద్దరు మహిళలు వీధిలో కొట్టుకున్నారు.

ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి .. దళిత మహిళను కర్రతో దారుణంగా కొట్టాడు (thrashed). సదరు పోలీసును సురాసంద్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ రాజ్‌కిషోర్‌ సింగ్‌గా గుర్తించారు. స్థానికులు చూస్తుండగానే యూనిఫాంలో ఉన్న రాజ్‌ కిషోర్‌ మహిళను చితకబాదాడు. ఈ ఘటనపై సీతామర్హి ఎస్పీ మనోజ్‌ కుమార్‌ తివారీ స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం సదరు పోలీసు అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మనోజ్‌ వెల్లడించారు.

Heres' Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement