Pushpa 2: The Rule: పుష్ప 2 సినిమాకి వచ్చి నా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నా, ఈ ఘటనపై అల్లు అర్జున్ ఇంకా స్పందించకపోవడం దారుణమని మృతురాలి భర్త ఆవేదన, న్యాయం చేయాలని డిమాండ్
పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు. కానీ మా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నానంటూ రేవతి భర్త భాస్కర్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఇప్పటికీ ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందించలేదు
పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 mmకు వచ్చిన ఓ మహిళ మృతి చెందిన సంగతి విదితమే. ఆమె కొడుకు కూడా ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాటం సాగిస్తున్నాడు. ఈ ఘటనపై ఆమె భర్త స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. మా బాబు శ్రీ తేజ అల్లు అర్జున్ ఫ్యాన్. వాడి కోసమే మేము సినిమాకి వచ్చాము. మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు.. అప్పటికి అభిమానులు మాములుగా ఉన్నారు. ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది.దీంతో తొక్కిసలాట జరిగింది. మా బాబు పడిపోయాడు.
పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహలోకి వచ్చాడు.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు. కానీ మా భార్యను కోల్పోవడం తట్టుకోలేకపోతున్నానంటూ రేవతి భర్త భాస్కర్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఇప్పటికీ ఈ ఘటన పై అల్లు అర్జున్ స్పందించలేదు. వెంటనే అల్లు అర్జున్ స్పందించి కుటుంబానికి అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. సంధ్య థియెటర్ పై చర్యలు తీసుకోవాలని రేవతి బంధువులు కోరారు.
Can't bear to lose my wife - Revathi's husband Bhaskar
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)