Chhattisgarh Helicopter Crash: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం, శిక్షణ సమయంలో కుప్పకూలిన ప్రభుత్వ హెలికాప్టర్, ఇద్దరు పైలట్లు మృతి
దీంతో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. రోజువారీ శిక్షణలో భాగంగా గురువారం రాత్రి పైలట్లు ఫ్లయింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో రన్ వే చివర్లో ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో హెలికాప్టర్ తునాతునకలు అయింది.
ఛత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద ఎయిర్‌పోర్ట్‌లో ప్రభుత్వ హెలికాప్టర్ (Helicopter) కుప్పకూలింది. దీంతో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. రోజువారీ శిక్షణలో భాగంగా గురువారం రాత్రి పైలట్లు ఫ్లయింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో రన్ వే చివర్లో ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో హెలికాప్టర్ తునాతునకలు అయింది. అందులో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడువగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారని ఎస్‌ఎస్పీ ప్రశాంత్ అగర్వాల్ తెలిపారు. మృతులను కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ ఏపీ శ్రీవాత్సవగా గుర్తించామన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై సీఎం భూపేశ్ బఘేల్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు.