Farmers Protest at Visakha Dairy: విశాఖ డెయిరీని ముట్టడించిన పాల రైతులు, పాల సేకరణ రేటును లీటరుకు రూ. 4 తగ్గించిన యాజమాన్యం
విశాఖలో పాల ధర పెంపు కోరుతూ ఉత్తరాంధ్ర జిల్లాల రైతుల విశాఖ డైయిరీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. నిరసన తెలుపుతున్న రైతులను, రైతు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరు రైతులు విశాఖ డైయిరీ ప్రధాన గేట్లను తోసుకుంటూ డైయిరీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. లోపలకు దూసుకుంటూ వెళ్లిన రైతులు, రైతు సంఘాల నాయకులు డెయిరీ లోపల చైర్మన్ ఛాంబర్ వద్ద ధర్నా నిర్వహించారు. పాల సేకరణ రేటును లీటరుకు రూ. 4 తగ్గించినందుకు రైతులు ముట్టడించినట్లుగా వార్తలు వస్తున్నాయి. విశాఖ డెయిరిలో రైతులకు న్యాయం జరిగేలాగా పాల ధర పెంచడానికి బోర్డు మీటింగ్ లో త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని విశాఖ డెయిరి ఎండి రమణ రైతులకు సోమవారం హామీ ఇచ్చారు.
వీడియో ఇదిగో, బరాబర్ కోటర్ తాగినా, ఏం చేస్తారో చేస్కోండి, ఉప్పల్ పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ
Dairy farmers Attack Visakha Dairy for reducing milk collection rate
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)