PM Modi on Farmers Protest: రైతుల డిమాండ్లపై స్పందించిన ప్రధాని మోదీ, రైతుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానం నెరవేర్చడానికి కేంద్రం కట్టుబడి ఉందని ట్వీట్
రైతుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చడానికి కేంద్రం కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకు పండించే రైతులకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని (ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్–ఎఫ్ఆర్పీ) రూ.25 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది
పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), మరికొన్ని డిమాండ్లతో ఢిల్లీ బార్డర్లలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ఖనౌరీ బార్డర్ లో బారికేడ్లు దాటి ఢిల్లీలోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా రైతులు వెనక్కి తగ్గకపోవడంతో దీంతో పోలీసులు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఓ టియర్ గ్యాస్ షెల్ పగిలి మంటలు చెలరేగాయి. రబ్బర్ బుల్లెట్లు తగలడంతో పలువురు రైతులు గాయపడ్డారు.
ఢిల్లీ బార్డర్ లో రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రైతుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చడానికి కేంద్రం కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకు పండించే రైతులకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని (ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్–ఎఫ్ఆర్పీ) రూ.25 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో దేశంలోని లక్షలాది చెరకు పండించే రైతులకు మేలు చేకూరనుందని వివరించారు. రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత, వీడియోలు ఇవిగో..
Here's PM Modi Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)