Farmers’ Protest: రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత, వీడియోలు ఇవిగో..
Farmers’ Protest (Photo Credit: ANI)

పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పంటలకు కనీస మద్దతు ధర అంశంలో రైతులు కేంద్రంపై మరోమారు దండయాత్ర ప్రారంభించారు (Formers protest). మొత్తం 23 వాణిజ్య పంటలకు కనీసం మద్దతు ధర గ్యారెంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్‌తో ఢిల్లీ ఛలో చేట్టారు. శాంతియుతంగా ఢిల్లీ వైపు పాదయాత్ర కొనసాగిస్తామని రైతులు చెబుతున్నప్పటికీ.. అందుకు ఏమాత్రం అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు. వీళ్లను అడ్డుకునేందుకు బహు అంచెల వ్యవస్థతో పోలీసులు సిద్ధం చేశారు.  త‌గ్గేదే లేదంటున్న అన్న‌దాత‌లు! ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో మ‌రోసారి హైటెన్ష‌న్, కేంద్రానికి విధించిన డెడ్ లైన్ ముగియ‌గానే హ‌స్తిన‌వైపు క‌దులుతామంటూ హెచ్చ‌రిక‌

శంభు సరిహద్దు (Shambhu border) వద్దకు భారీగా చేరుకొని రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు రాజధానిలోకి ప్రవేశించకుండా ముళ్ల కంచెలు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. రైతులపై భద్రతా దళాలు మరోసారి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. డ్రోన్లతో రైతులపైకి టియర్‌ గ్యాస్‌ వదిలారు. దీంతో కొందరు రైతులకు స్వల్ప గాయపడ్డారు.రైతులపై హర్యానా పోలీసులు ఇప్పటికే ఓసారి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించిన విషయం తెలిసిందే.

Here's PTI Videos

పోలీసుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని వాపోతున్నారు. తమపై టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుత ప్రదర్శనకూ అనుమతివ్వకపోవడంపై వారు మండిపడుతున్నారు