Pune, March 14: మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ (Pratibha Patil) ఆసుపత్రిలో చేరారు. పుణెలోని భారతీ హాస్పిటల్‌లో బుధవారం రాత్రి నుంచి చికిత్స పొందుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో (Chest Infection) బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. భారత్‌కు రాష్ట్రపతిగా పనిచేసిన తొలి మహిళగా ప్రతిభా పాటిల్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 2007 నుంచి 2012 వరకు పదవిలో ఉన్నారు.
Maharashtra | Former President Pratibha Patil was hospitalised in Bharti Hospital in Pune, due to a chest infection & fever, condition stable: Hospital officials.
— ANI (@ANI) March 14, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)