విశాఖపట్నం ఎయిర్‌పోర్టు(Visakhapatnam Airport)లో ప్రమాదకర బల్లులు స్మగ్లింగ్ కలకలం రేపింది. డీఆర్‌ఐ, అటవీ సర్వీస్‌ అధికారుల(DRI and Forest Service Officers) సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ప్రమాదకర బల్లులు తరలిస్తున్నట్లు గుర్తించారు. మూడు నీలి రంగు నాలుక బల్లులు, మూడు విదేశీ బల్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.

మనుషులే కాదు పక్షులూ విడాకులు తీసుకుంటాయట.. ఆస్ట్రేలియా పరిశోధకుల వెల్లడి.. మరి ఎందుకు విడాకులు తీసుకుంటాయంటే??

ఈ బల్లులను థాయ్‌లాండ్‌(Thailand) నుంచి అక్రమంగా భారత్‌(India)కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ బల్లులను ఎవరు, ఎవరికి పంపిస్తున్నారనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు. నిషేధిత వస్తువులు, జంతువులు తరలించడం నేరమని, ఈ బల్లులు అత్యంత ప్రమాదకరమైనవని, వీటి తరలింపు వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షిస్తామని అధికారులు హెచ్చరించారు.

Two arrested at Vizag airport for smuggling rare lizard species

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)