కేరళలోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో మలేషియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు 47పాములు, రెండు బల్లులతో పట్టుబడ్డాడు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్‌లో వీటిని గుర్తించిన కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని ముహమ్మద్ మెయిదీన్‌గా గుర్తించారు.

బటిక్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో వచ్చిన మెయిదీన్ బ్యాగు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. బ్యాగును తెరిచిన అధికారులు షాకయ్యారు. అందులో ఉన్న చిన్నచిన్న పెట్టెలను తెరిస్తే బతికి ఉన్న వివిధ రకాలైన 47 పాములు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని పాములతోపాటు రెండు బల్లులను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ప్రకారం వీటిని తిరిగి మలేసియాకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

Customs seize 47 snakes and 2 lizards from passenger’s bag at Trichy Airport

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)