Mumbai, NOV 23: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్.. తన మిడ్ సైజ్ సెడాన్ 2025 టయోటా కమ్రీ (Toyota Camry) కారును డిసెంబర్ 11న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. దేశీయ మార్కెట్లో తొలిసారి 2013లో ఆవిష్కరించింది. ప్రస్తుతం వస్తున్న నైన్త్ జనరేషన్ టయోటా కమ్రీ కారు పలు అప్ డేట్స్‌తో అందుబాటులోకి వస్తున్నది. ఆల్ వీల్ డ్రైవ్ హైబ్రీడ్ పవర్ ట్రైన్ తో వస్తున్న టయోటా కమ్రీ (Toyota Camry) గ్లోబల్ మార్కెట్లలో సుమారు రూ.23.7 లక్షలు (28,400 యూఎస్ డాలర్లు – ఎక్స్ షోరూమ్), టాప్ వేరియంట్ దాదాపు రూ.30.1 లక్షలు (36,125 యూఎస్ డాలర్లు – ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. న్యూ కమ్రీ కారు నాలుగు వేర్వేరు ట్రిమ్స్ – ఎల్ఈ, ఎస్ఈ, ఎక్స్ఎల్ఈ, ఎక్స్ఎస్ఈ వేరియంట్లలో వస్తుంది. వీటిల్లో ఎస్ఈ, ఎక్స్ఎస్ఈ వేరియంట్లు స్పోర్ట్ ట్యూన్డ్ సస్పెన్షన్‌తో అందుబాటులోకి వస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో కమ్రీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ లేదా ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ తో వస్తున్నాయి.
Mahindra Xuv700 Price Hiked: కారు కొనాలనుకుంటున్నారా? ఈ మోడల్ ధర ఏకంగా రూ. 50వేలు పెంచేసిన కంపెనీ
2025 టయోటా కమ్రీ పూర్తిగా ఫ్రంట్ ఎండ్ డిజైన్ రీవర్క్ చేశారు. ప్రస్తుత జనరేషన్ లెక్సస్ సెడాన్ కార్లలో మాదరిగా వైడర్ ఫ్రంట్ గ్రిల్లె, షార్పర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తోపాటు స్లీక్ హెడ్ ల్యాంప్స్, సెడాన్ కారుకు బోల్డ్ లుక్ వచ్చేలా లార్జ్ రేడియేటర్ గ్రిల్లె ఉంటుంది. స్పోర్ట్ మెష్ ఫ్రంట్ గ్రిల్లెస్, సైడ్ రాకర్స్, డ్యుయల్ టిప్ ఎగ్జాస్ట్స్, బ్లాక్డ్ ఔట్ వెర్టికల్ ఎయిర్ వెంట్స్ వంటి ఫీచర్లతో ఎస్ఈ, ఎక్స్ఎస్ఈ మోడల్ కార్లు స్పోర్టీ లుక్ కలిగి ఉంటాయి.
ఇంక ఇంటీరియర్‌గా, ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్‌లోనూ టయోటా కమ్రీ కారు పలు అప్ గ్రేడ్స్ పొందింది. స్టాండర్డ్‌గా క్లాత్ అండ్ సింథటిక్ అప్‌హోల్‌స్టరీ, ఎస్ఈ అండ్ ఎక్స్ఎస్ఈ వేరియంట్లలో హీటెడ్ సీట్స్, హీటెడ్ స్టీరింగ్ వీల్ తోపాటు లెదర్ అప్‌హోల్‌స్టరీ ఉంటాయి. రేర్ ప్యాసింజర్లు వ్యక్తిగత క్లైమేట్ జోన్స్ పొందుతారు. కమ్రీ ఎల్ఈ వేరియంట్ 8- అంగుళాల ఇన్‌ఫోటైన్ మెంట్ స్క్రీన్ తో వస్తుంది. ఇతర రెండు మోడళ్లలో ప్రామాణికంగా ఉండే 12.3 అంగుళాల పొడవైన స్క్రీన్ ఎస్ఈ వేరియంట్ కారులో ఉంటుంది. డిజిటల్ గాజ్ క్లస్టర్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ విత్ పెడిస్ట్రైన్ డిటెక్షన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ అసిస్ట్ తదితర ఫీచర్లు ఉంటాయి.
2025 టయోటా కమ్రీ మోడల్ కారులో 3.5 లీటర్ల వీ6 ఇంజిన్ తప్పించేసి వేర్వేరు డ్రైవ్ ట్రైన్స్‌లో రెండు హైబ్రీడ్ ఇంజిన్లను అందిస్తున్నది. రెండింటిలోనూ స్టాండర్డ్‌గా 2.5 లీటర్ల ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఎఫ్ డబ్ల్యూడీ వేరియంట్ విత్ టూ ఎలక్ట్రిక్ మోటార్స్, ఏడబ్ల్యూడీ వేరియంట్ విత్ థర్డ్ మోటార్ డ్రైవింగ్ ది రియల్ యాక్సిల్ ఆప్షన్లతో టయోటా కమ్రీ వస్తున్నాయి. ఎఫ్ డబ్ల్యూడీ వేరియంట్ 225 బీహెచ్పీ విద్యుత్, ఏడబ్ల్యూడీ మోడల్ 232 బీహెచ్పీ విద్యుత్ విడుదల చేస్తాయి. భారత్ మార్కెట్లో విడుదల చేసే కమ్రీ కేవలం ఏడబ్ల్యూడీ డ్రైవ్ ట్రైన్ ఆప్షన్ తో వస్తుంది.