Hardoi: గూడ్స్ రైలు చక్రాల మధ్య ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు,వీడియో సోషల్ మీడియాలో వైరల్, అసలేం జరిగిందంటే..

గూడ్స్ రైలు చక్రాల మధ్యనున్న స్థలంలో ఇరుక్కుపోయిన బాలుడు దాదాపు వంద కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఇందుకుzసంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రైల్వే ట్రాక్ పక్కనే ఓ కుటుంబం నివసిస్తోంది.

Small Boy Miraculously Survives After Travelling Over 100 Kms While Sitting Between Wheels of Goods Train, Rescued by RPF Personnel

గూడ్స్ రైలు చక్రాల మధ్యనున్న స్థలంలో ఇరుక్కుపోయిన బాలుడు దాదాపు వంద కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఇందుకుzసంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. రైల్వే ట్రాక్ పక్కనే ఓ కుటుంబం నివసిస్తోంది. పదేళ్లలోపు ఉండే వారి కుమారుడు ఆడుకుంటూ తమ నివాసానికి ఎదురుగా ఆగివున్న గూడ్సురైలు కిందికి వెళ్లాడు. ఆ తర్వాత కాసేపటికే రైలు కదలడంతో బయటకు రాలేక చక్రాల మధ్య ఉండే ఖాళీ స్థలంలో కూర్చుండిపోయాడు. అలా కదిలిన రైలు ఏకంగా వంద కిలోమీటర్లు ప్రయాణించి యూపీలోని హర్దోయ్ స్టేషన్‌కు చేరుకుంది.

రైలు సిబ్బంది తనిఖీ చేస్తుండగా బాలుడిని చూసి షాకయ్యారు. వారు వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారొచ్చి బాలుడిని జాగ్రత్తగా బయటకు తీశారు. అనంతరం హర్దోయ్‌లోని చైల్డ్‌కేర్ సెంటర్‌కు తరలించారు. బాలుడి కుటుంబం లక్నో-అలంనగర్ రాజాజీపూర్‌లోని బాలాజీ మందిర్‌లో నివసిస్తున్నట్టు విచారణలో తెలిసింది.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement