Himachal Pradesh Cloudburst: వైరల్ వీడియో.. ఒక్కసారిగా విరుచుకుపడిన క్లౌడ్‌బస్ట్, నలుగురు గల్లంతు, హిమాచల్ ప్రదేశ్‌లో కులు జిల్లాలో విషాద ఘటన
ఈ ఘటన వల్ల స్థానిక గ్రామాల్లో భారీ నష్టం సంభవించింది. చోజ్ గ్రామంలో క్లౌడ్‌బస్ట్ కావడం వల్ల నలుగురు గల్లంతు అయినట్లు కులు ఎస్పీ గురుదేవ్ చాంద్ శర్మ తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్‌లో కులు జిల్లాలోని పార్వతి లోయలో ఉన్న చోజ్ ముల్లా వద్ద అకస్మాత్తుగా క్లౌడ్‌బస్ట్ అయ్యింది. ఈ ఘటన వల్ల స్థానిక గ్రామాల్లో భారీ నష్టం సంభవించింది. చోజ్ గ్రామంలో క్లౌడ్‌బస్ట్ కావడం వల్ల నలుగురు గల్లంతు అయినట్లు కులు ఎస్పీ గురుదేవ్ చాంద్ శర్మ తెలిపారు. పార్వతి నదిలో అకస్మాత్తుగా వరద పెరగడంతో సమీపంలో ఉన్న క్యాంపు సైట్లన్నీ ఆ ధాటికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఆ వరద ప్రభావం వల్ల కొందరు టూరిస్టులు కొట్టుకుపోయి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. చోజ్ గ్రామంతో లింకు ఉన్న బ్రిడ్జ్ ధ్వంసం అయ్యింది. నది సమీపంలో ఉన్న ఆరు కేఫ్‌లు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)