Himachal Fire: కుల్లు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం, తెల్లవారుజామున ఒక్కసారిగా చెలరేగిన మంటలు, పలు దుకాణాలు, ఇండ్లు పూర్తిగా దగ్ధం

హిమాచల్‌లోని (Himachal Pradesh) కుల్లు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బంజార్‌ ప్రాంతంలో సోమవారం ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి విస్తరించడంతో భారీ అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో పలు దుకాణాలు, ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

Fire accident (Credits: Twitter)

హిమాచల్‌లోని (Himachal Pradesh) కుల్లు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బంజార్‌ ప్రాంతంలో సోమవారం ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి విస్తరించడంతో భారీ అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో పలు దుకాణాలు, ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగిందని, ఇప్పటివరకు ఎవరికీ హాని జరుగలేదని అధికారులు తెలిపారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now