Himachal Landslides: వీడియో ఇదిగో, కులు జిల్లాలో ఇళ్ల మీద విరిగిపడిన కొండ చరియలు, శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోయినట్లుగా వార్తలు
హిమాచల్(Himachal Pradesh)లోని కులు జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీని వల్ల అనేక ఇండ్లు నేలమట్టం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. కులు జిల్లాలోని అన్నీ పట్టణంలో తాజాగా కొండచరియలు విరిగిపడ్డాయి.
హిమాచల్(Himachal Pradesh)లోని కులు జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీని వల్ల అనేక ఇండ్లు నేలమట్టం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. కులు జిల్లాలోని అన్నీ పట్టణంలో తాజాగా కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ రెడ్ అలర్ట్ వార్నింగ్ ఇచ్చింది. అన్నీ టౌన్‌లో ఉన్న భారీ బిల్డింగ్‌లు కూలిపోయాయి. అయితే రెండు రోజుల క్రితమే ఆ బిల్డింగ్‌ల నుంచి జనాన్ని తరలించారు. సీఎం సుఖ్విందర్ సింగ్ సూకు ఆదేశాల ప్రకారం ఆ బిల్డింగ్‌లను ఖాళీ చేశారు. కులు-మండి హైవేపై భారీ వర్షం వల్ల వాహనాలు నిలిచిపోయాయి.
Here's Video