Coronavirus in India: మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, 24 గంటల్లో 12వేలు దాటిన కొత్తకేసులు, క్రమంగా పెరుగుతున్న పాజిటివిటీ రేటు, ఆందోళనలో కేంద్రం, రాష్ట్రాలు అప్రమత్తం
దేశంలో కరోనా కేసులు (Corona Cases) మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం 8 వేల కేసులు నమోదవగా, బుధవారం ఆ సంఖ్య 9 వేలు దాటింది. నేడు మరో 12,608 మందికి కరోనా పాజిటివ్ (Corona positive) వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,42,98,864కు చేరింది. ఇందులో 4,36,70,315 మంది బాధితులు (Recoveries) కోలుకున్నారు.
New Delhi, AUG 18: దేశంలో కరోనా కేసులు (Corona Cases) మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం 8 వేల కేసులు నమోదవగా, బుధవారం ఆ సంఖ్య 9 వేలు దాటింది. నేడు మరో 12,608 మందికి కరోనా పాజిటివ్ (Corona positive) వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,42,98,864కు చేరింది. ఇందులో 4,36,70,315 మంది బాధితులు (Recoveries) కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,206 మంది మరణించగా, మరో 1,01,343 కేసులు యాక్టివ్‌గా (Active cases) ఉన్నాయి. ఇక బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 72 మంది మరణించగా, 16,251 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాటివిటీ రేటు 3.48 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.58 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా 208.95 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)