Uttar Pradesh: వీడియో ఇదిగో, సహనం కోల్పోయిన భారత షూటర్, క్యాబ్ డ్రైవర్‌పై తుఫాకీతో విచక్షణారహితంగా దాడి

యూపీలోని లక్నోలో ఓ భారత షూటర్ తన కారును ఢీ కొట్టాడనే కోపంతో విచక్షణ కోల్పోయి ఓ క్యాబ్ డ్రైవర్ పై దాడి చేశారు. తన లైసెన్స్ డ్ రివాల్వర్ బయటకు తీసి బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదుతో సదరు షూటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. క్యాబ్ డ్రైవర్ పై షూటర్ దాడికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Man Attacked With Butt of Pistol in Middle of Road in Lucknow, Accused Arrested Video Goes Viral

యూపీలోని లక్నోలో ఓ భారత షూటర్ తన కారును ఢీ కొట్టాడనే కోపంతో విచక్షణ కోల్పోయి ఓ క్యాబ్ డ్రైవర్ పై దాడి చేశారు. తన లైసెన్స్ డ్ రివాల్వర్ బయటకు తీసి బెదిరించాడు. బాధితుడి ఫిర్యాదుతో సదరు షూటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. క్యాబ్ డ్రైవర్ పై షూటర్ దాడికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళను చూస్తూ ఆప్ మంత్రి హస్తప్రయోగం, సస్పెండ్ చేయాలంటూ బీజేపీ డిమాండ్

భారత షూటర్ వినోద్ మిశ్రా లక్నోలో తన కారులో వెళుతుండగా ఓ క్యాబ్ డ్రైవర్ ఢీ కొట్టాడు. దీంతో కారును అక్కడే ఆపేసి కిందికి దిగిన మిశ్రా.. సదరు క్యాబ్ డ్రైవర్ రంజిత్ శుక్లాతో గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన వినోద్ మిశ్రా.. తన లైసెన్స్ డ్ గన్ తీసి బెదిరింపులకు గురిచేశాడు. బిజీ రోడ్డుపై చుట్టూ వాహనాలు వెళుతుండగా గన్ తీసి రంజిత్ శుక్లాపై దాడి చేశారు. రివాల్వర్ బట్ తో పదే పదే కొట్టాడు. ఈ తతంగాన్నంతా ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన పోలీసులు.. షూటర్ వినోద్ మిశ్రాను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. బాధితుడు రంజిత్ శుక్లా ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement