Kannauj Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, వేగంగా వెళ్తూ అదుపుతప్పి ట్రక్‌ను డీకొట్టిన కారు, ఐదుగురు వైద్యులు సహా ఆరుగురు మృతి
మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్యులు సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులు సైఫాయి మెడికల్ కాలేజీకి చెందినవారని, లక్నో నుంచి సైఫాయికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ తెల్లవారుజామున 3.43 గంటలకు జరిగిన ఈ ప్రమాదానికి గల అసలు కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
వీడియో ఇదిగో, నిద్రమత్తులో బస్సును కాలువలోకి తీసుకువెళ్లిన డ్రైవర్, బస్సులో 20 మంది ప్రయాణికులు
వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రోడ్డులోకి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీకొట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జయ్‌వీర్ సింగ్ సైఫాయి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు.
Kannauj Road Accident:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)