HAL's Helicopter Factory: దేశంలోనే అతిపెద్ద హెచ్ఏఎల్ హెలికాప్టర్ తయారీ కేంద్రం, కర్ణాటకలోని తుమకూరులో ప్రారంభించిన ప్రధాని మోదీ

కర్ణాటక తుమకూరులో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తేలికపాటి హెలికాప్టర్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. మోదీతో పాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

PM Modi inaugurates HAL's Helicopter Factory (Photo-Twitter/video grab)

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కర్ణాటక తుమకూరులో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తేలికపాటి హెలికాప్టర్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. మోదీతో పాటు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మోదీ శంకుస్థాపన చేసిన హెచ్ఏఎల్ హెలికాప్టర్ తయారీ కేంద్రం దేశంలోనే అతిపెద్దది. 615 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. భారత్‌లో హెలికాప్టర్ల అవసరాలను ఒక్క చోటు నుంచే తీర్చాలనే ఉద్దేశంతో కేంద్రం దీన్ని ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీలో మొదటగా లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు(తేలికపాటి హెలికాప్టర్లు) మాత్రమే తయారు చేస్తారు. వీటిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేశారు. మూడు టన్నుల బరువుండే ఈ సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లను అత్యంత సులభంగా నడపవచ్చు.

Here's HAL helicopter factory inaugurates 



సంబంధిత వార్తలు