Madhya Pradesh: రైతుల పాస్‌బుక్ కోసం లంచం అడిగిన బ్యాంక్‌ ఉద్యోగి, ఆవేశంతో చితకబాదిన రైతులు, ఉద్యోగిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపిన అవంతిపూర్ బడోడియా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌

పాస్‌బుక్‌ల జారీ కోసం బ్యాంక్‌ ఉద్యోగి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాడని రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ వద్దకు వచ్చిన కొందరు రైతులు ఆ ఉద్యోగిని కొట్టారు.

Bank Employee Was Thrashed by Farmers in Shajapur (Photo-ANI)

పాస్‌బుక్‌ కోసం లంచం అడిగిన బ్యాంక్‌ ఉద్యోగిని రైతులు చితక్కొట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో జరిగింది. పాస్‌బుక్‌ల జారీ కోసం బ్యాంక్‌ ఉద్యోగి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాడని రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బ్యాంక్‌ వద్దకు వచ్చిన కొందరు రైతులు ఆ ఉద్యోగిని కొట్టారు. మరోవైపు పాస్‌బుక్‌ జారీకి రైతులను లంచం అడిగిన ఆ బ్యాంక్‌ ఉద్యోగిని అరెస్ట్‌ చేసినట్లు అవంతిపూర్ బడోడియా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎల్ రాజోరియా తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)