Madhya Pradesh: ఇతనే 39 మందికి ఒకే సిరంజీతో కరోనా టీకా వేసింది, ఇందులో తన తప్పు ఏమీ లేదంటున్న నిందితుడు, పై అధికారులు ప్రతి ఒక్కరికీ ఒక్కటే సిరంజీ వాడాలని సూచించినట్టు వెల్లడి
మధ్య ప్రదేశ్ లోని సాగర్ పట్టణంలో స్కూల్ విద్యార్థులు 39 మందికి ఒకే సిరంజీతో కరోనా టీకాను ఇవ్వడం సంచలనం సృష్టించింది. జైన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఈ ఘటన బుధవారం జరిగింది. టీకాలు ఇచ్చిన జితేంద్ర అహిర్వార్ పై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
మధ్య ప్రదేశ్ లోని సాగర్ పట్టణంలో స్కూల్ విద్యార్థులు 39 మందికి ఒకే సిరంజీతో కరోనా టీకాను ఇవ్వడం సంచలనం సృష్టించింది. జైన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఈ ఘటన బుధవారం జరిగింది. టీకాలు ఇచ్చిన జితేంద్ర అహిర్వార్ పై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.అహిర్వార్ ను ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీ విద్యార్థిగా గుర్తించారు. ఆరోగ్య శాఖ తరఫున కరోనా నివారణ టీకాలు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు జిల్లా వైద్యాధికారి డీకే గోస్వామి తెలిపారు. ఈ ఘటనలో జిల్లా టీకాల కార్యక్రమం అధికారిని సస్పెండ్ చేశారు.
తనను స్కూల్ వద్ద ఉన్నతాధికారి కారులో దింపేసి వెళ్లాడని, కేంద్రంలోని ప్రతి ఒక్కరికీ ఒక్కటే సిరంజీ వాడాలని సూచించినట్టు.. ఇందులో తన తప్పు ఏమీ లేదంటూ జితేంద్ర అహిర్వార్ చేసిన ఆరోపణలు సంచలనానికి దారితీశాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్నదని డీకే గోస్వామి తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)