Madhya Pradesh: శ్రీరామనవమి వేడుకల్లో ఘోర ప్రమాదం, ఆలయంలో పైకప్పు కూలిపోవడంతో బావిలో పడిపోయిన భక్తులు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో.. శ్రీరామనవమి సందర్భంగా.. ఓ ఆలయంలో పైకప్పు కూలిపోవడంతో అక్కడున్న భక్తులంతా.. కింద ఉన్న మెట్ల బావిలో పడిపోయారు. ప్రస్తుతం వాళ్లను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌ శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ మందిర్‌లో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

temple collapsed in Patel Nagar area (Photo-ANI)

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో.. శ్రీరామనవమి సందర్భంగా.. ఓ ఆలయంలో పైకప్పు కూలిపోవడంతో అక్కడున్న భక్తులంతా.. కింద ఉన్న మెట్ల బావిలో పడిపోయారు. ప్రస్తుతం వాళ్లను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్‌ శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ మందిర్‌లో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పాతిక మందికి పైగా భక్తులు బావిలో పడిపోయినట్లు సమాచారం. తొలుత స్థానికులు వాళ్లను బయటకు తీసేందుకు యత్నించారు. కొందరిని రక్షించగలిగారు. ఈలోపు పోలీసులు, వైద్య సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. పైకప్పు శిథిలాల కింద బావిలో భక్తులు ఇరుక్కుని ఉండడంతో.. వాళ్లను రక్షించడం కష్టతరంగా మారిందని అధికారులు చెప్తున్నారు.

Here's Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement