Maharashtra: మహారాష్ట్రలో పారిశ్రామిక వేత్త ఇంటిపై ఐటీ దాడులు, రూ 390 కోట్ల విలువైన అక్ర‌మాస్తులు స్వాధీనం, నగదు లెక్కబెట్టడానికి 13 గంటల సమయం 

మ‌హారాష్ట్ర‌కు చెందిన పారిశ్రామికవేత్త‌పై నిర్వ‌హించిన ఐటీ దాడుల్లో రూ 390 కోట్ల విలువైన అక్ర‌మాస్తుల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జ‌ల్నా, ఔరంగాబాద్ న‌గ‌రాల్లో పారిశ్రామిక‌వేత్త‌కు చెందిన ఇండ్లు, కార్యాల‌యాల‌పై ఆగ‌స్ట్ 1 నుంచి 8 వ‌ర‌కూ ఐటీ అధికారులు దాడులు చేప‌ట్టారు.

Money | Image used for representational purpose (Photo Credits: IANS)

మ‌హారాష్ట్ర‌కు చెందిన పారిశ్రామికవేత్త‌పై నిర్వ‌హించిన ఐటీ దాడుల్లో రూ 390 కోట్ల విలువైన అక్ర‌మాస్తుల‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జ‌ల్నా, ఔరంగాబాద్ న‌గ‌రాల్లో పారిశ్రామిక‌వేత్త‌కు చెందిన ఇండ్లు, కార్యాల‌యాల‌పై ఆగ‌స్ట్ 1 నుంచి 8 వ‌ర‌కూ ఐటీ అధికారులు దాడులు చేప‌ట్టారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో రూ 58 కోట్ల లెక్క తేల‌ని న‌గ‌దుతో పాటు 32 కిలోల బంగారం ఉంద‌ని అధికారులు తెలిపారు. సీజ్ చేసిన న‌గ‌దును లెక్కించేందుకు అధికారుల‌కు 13 గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. 260 మంది అధికారులు, ప‌లువురు సిబ్బంది ఈ దాడుల్లో పాలుపంచుకున్నారు. అధికారులు, సిబ్బంది ఐదు బృందాలుగా విడిపోయి దాడులు చేప‌ట్టిన‌ట్టు స‌మాచారం.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement