Manchu Family Dispute: వీడియో ఇదిగో, మీడియాపై తండ్రి మోహన్ బాబు దాడిపై కన్నీళ్లతో క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్, సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలను వెల్లడిస్తానని వెల్లడి
తండ్రి మంచు మోహన్ బాబు మీడియాపై దాడికి క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్. మీడియాపై మా నాన్న దాడి చేయడం బాధ కలిగించింది. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా అని వీడియో ద్వారా తెలిపారు. నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు. మా నాన్న ను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు.
తండ్రి మంచు మోహన్ బాబు మీడియాపై దాడికి క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్. మీడియాపై మా నాన్న దాడి చేయడం బాధ కలిగించింది. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు క్షమాపణలు చెబుతున్నా అని వీడియో ద్వారా తెలిపారు. నాన్న అంటే నాకు ప్రాణం.. మా నాన్న దేవుడు. మా నాన్న ను మా అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారు. మా నాన్న దృష్టిలో నన్ను శత్రువు గా చిత్రీకరించారు. నేను నా భార్య కలిసి ఒక టాయ్స్ కంపెనీ పెట్టాము. వాటికి కూడా అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు.
నా పై దాడులు చేశారు..మా నాన్న ముందే నన్ను కొట్టారు. నాకు సపోర్ట్ చేస్తున్న మా అమ్మ ను కూడా డైవర్ట్ చేశారు. మూడు రోజులు బయటకు వెళ్ళు, మనోజ్ కి సర్ధిచెప్తాం అని మా అమ్మను కూడా నమ్మించారు. నా భార్య, ఏడు నెలల కూతురి పేరు ఇందులోకి లాగుతున్నారు. నేను నా సొంత కాళ్ల మీద నిలబడుతున్నాను. నేను ఎవరిని ఆస్తి అడగలేదు. సాయంత్రం 5 గంటలకు ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడిస్తానని మంచు మనోజ్ తెలిపారు.
Manchu Manoj apologized to media over father attack on reporter
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)