Uttar Pradesh Shocker: మొబైల్ చార్జింగ్ పెడుతుండగా ఇంటికి అంటుకున్న మంటలు, నలుగురు పిల్లలు మంటల్లో సజీవ దహనం

ఆ ఇంట్లో నివసిస్తున్న భర్త, భార్య, నలుగురు పిల్లలకు కాలిన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ నలుగురు పిల్లలు (4 Children Dead In Fire accident) మరణించారు.మహిళ పరిస్థితి సీరియస్‌గా ఉండగా ఆమె భర్త ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

Shichita Singh, circle officer of Daurala (Photo/ANI)

యూపీలో మీరట్ లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఇంట్లో నివసిస్తున్న భర్త, భార్య, నలుగురు పిల్లలకు కాలిన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ నలుగురు పిల్లలు (4 Children Dead In Fire accident) మరణించారు.మహిళ పరిస్థితి సీరియస్‌గా ఉండగా ఆమె భర్త ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

శనివారం సాయంత్రం పల్లవ్‌పురం ప్రాంతంలోని ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పివేశారు. విద్యుత్‌ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)