Mohali: అత్యాచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలంటే రూ. 20 వేలు ఇవ్వాల్సిందే, అత్యాచార బాధితురాలి నుంచి లంచం డిమాండ్ చేసిన మహిళా పోలీస్ అధికారి

పంజాబ్ మొహాలీలో ఓ మహిళా పోలీస్ అధికారి అత్యాచార బాధితురాలి నుంచి లంచం తీసుకుంటూ సీసీ టీవీ పుటేజీకి చిక్కింది. నిందితుడిపై కేసు నమోదు చేసేందుకు బాధితురాలి నుంచి రూ.20వేలు వసూలు చేసింది.

Representational Image | (Photo Credits: PTI)

పంజాబ్ మొహాలీలో ఓ మహిళా పోలీస్ అధికారి అత్యాచార బాధితురాలి నుంచి లంచం తీసుకుంటూ సీసీ టీవీ పుటేజీకి చిక్కింది. నిందితుడిపై కేసు నమోదు చేసేందుకు బాధితురాలి నుంచి రూ.20వేలు వసూలు చేసింది. స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఏఎస్‌ఐ డబ్బు తీసుకున్న దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఏఎస్‌ఐ పర్వీన్ కౌర్‌ లంచం తీసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని డీఎస్‌పీ దర్పణ్ అహ్లూవాలియా పేర్కొన్నారు. విజిలెన్స్ బ్యూరో దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement