IPL Auction 2025 Live

Mumbai Rains: ముంబైలో భారీ వర్షాలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఆదేశాలు, రాయిగ‌డ్‌, ర‌త్న‌గిరి జిల్లాల‌కు రెడ్‌, ఆరెంజ్ హెచ్చ‌రిక‌లు

దీంతో అధికార యంత్రంగం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం కూడా హెచ్చరించింది. శివారు ప్రాంతాలన్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్ప‌డుతున్నాయి

Heavy rains. (Photo Credits: PTI)

దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రంగం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం కూడా హెచ్చరించింది. శివారు ప్రాంతాలన్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఏర్ప‌డుతున్నాయి. న‌గ‌రంలోని కొన్ని రూట్ల‌లో రైలు, బ‌స్సు స‌ర్వీసుల‌పై ప్ర‌భావం ప‌డింది. లోత‌ట్టు ప్రాంతాలు, రైల్వే ట్రాక్‌లు మునిగిపోవ‌డంతో ట్రాఫిక్ నిలిచిపోతోంది. సోమ‌వారం నుంచి ముంబైలో వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని న‌దుల్లో నీటి స్థాయి పెరుగుతూనే ఉంది. రాయిగ‌డ్‌, ర‌త్న‌గిరి జిల్లాల‌కు రెడ్‌, ఆరెంజ్ హెచ్చ‌రిక‌ల‌ను జారీ చేశారు. త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఏక్‌నాథ్ షిండే ప్ర‌భుత్వ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు