Navratri 2022: దుర్గా పూజలో అపశృతి, ఒక్కసారిగా మంటపంలో ఎగసిన మంటలు, 5గురు మృతి, మరో 64 మందికి గాయాలు
యూపీలో నాథువా గ్రామంలోని పండల్ వద్ద డిజిటల్ షో జరుగుతుండగా ఆదివారం రాత్రి మంటలు చెలరేగడంతో నిర్మాణం పూర్తిగా దగ్ధమైంది.
హాలోజన్ లైట్ వేడెక్కడం వల్ల దుర్గాపూజ పండల్‌లో మంటలు చెలరేగడంతో ఐదుగురు వ్యక్తులు మరణించగా, 64 మంది గాయపడ్డారని అధికారులు సోమవారం తెలిపారు. యూపీలో నాథువా గ్రామంలోని పండల్ వద్ద డిజిటల్ షో జరుగుతుండగా ఆదివారం రాత్రి మంటలు చెలరేగడంతో నిర్మాణం పూర్తిగా దగ్ధమైంది.మంటలు చెలరేగిన సమయంలో పండల్‌లో 300 మందికి పైగా ఉన్నారు వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) గౌరంగ్ రాఠీ మాట్లాడుతూ ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పండల్ వద్ద హాలోజన్ లైట్ వేడెక్కడంతో మంటలు చెలరేగాయని, దీంతో విద్యుత్ వైరుకు మంటలు అంటుకున్నాయని తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)