New ED Director: ఈడీ కొత్త బాస్‌గా రాహుల్ నవీన్, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పదవిలో కొనసాగనున్న 1993 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి
ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1993 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన నవీన్ ఈడీ డైరెక్టర్‌గా రెండేండ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏది ముందైతే అప్పటివరకు పదవిలో కొనసాగుతారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలిక చీఫ్‌గా ఉన్న రాహుల్ నవీన్ పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు క్యాబినెట్ నియామకాల కమిటీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1993 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన నవీన్ ఈడీ డైరెక్టర్‌గా రెండేండ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏది ముందైతే అప్పటివరకు పదవిలో కొనసాగుతారు. 57 ఏండ్ల నవీన్ ఈడీలో 2019 నవంబర్‌లో ప్రత్యేక డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గత ఏడాది సెప్టెంబర్ 15న నవీన్ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈయన హయాంలోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్‌లను మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ అరెస్ట్ చేసింది.
Here's News