YS Jagan on Sharmila: చెల్లి షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు, 1.7 శాతం ఓట్ షేర్ మాత్రమే ఉన్న వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదంటూ..

చెల్లి షర్మిల గురించి, 1.7 శాతం ఓట్ షేర్ మాత్రమే ఉన్న కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు.

YS Sharmila and YS Jagan (photo-Facebook)

రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, వార్షిక బడ్జెట్‌పై బుధవారం మీడియాతో మాట్లాడారు మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడువైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.దురదృష్టవశాత్తూ 8 నెలలు అయిపోయాక, ఇంకో నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ముందే బడ్జెట్‌ ప్రవేశపెడితే చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు బయటపడతాయని, ప్రజలు తమ హామీలు అడుగుతారన్న భయంతో ఇన్నాళ్లు సాగదీస్తూ వచ్చారన్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీకి వెళ్లనప్పుడు రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేసింది కదా అని అడిగిన మీడియా ప్రతినిధికి జగన్ సమాధానమిస్తూ.. చెల్లి షర్మిల గురించి, 1.7 శాతం ఓట్ షేర్ మాత్రమే ఉన్న కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు.

వీడియో ఇదిగో, జగనన్నను అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేసిన షర్మిల, సోషల్ మీడియాలో మాపై అసభ్యకర పోస్టులు పెట్టించింది ఆయనేనని మండిపాటు

YS Jagan on Sharmila

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు