Locals Attack CBI Officials: చిన్నారులపై లైంగిక దాడుల విచారణకు వెళ్లిన సీబీఐ అధికారులపై గ్రామస్తులు దాడి, విచారణ కొనసాగుతుండగానే ఇంటికి తాళంవేసి కర్రలతో అటాక్

ఓ కేసులో విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు (CBI officials) నిందితుడిని అతని ఇంట్లో విచారిస్తున్నారు. అయితే విచారణ కొనసాగుతుండగానే గ్రామస్తులు ఆ అధికారులపై (Locals Attack CBI Officials) దాడిచేశారు.

Locals Attack CBI Officials (Photo-Video Grab)

ఒడిషాలో స్థానికులు సీబీఐ అధికారులపై దాడికి దిగారు. ఓ కేసులో విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు (CBI officials) నిందితుడిని అతని ఇంట్లో విచారిస్తున్నారు. అయితే విచారణ కొనసాగుతుండగానే గ్రామస్తులు ఆ అధికారులపై (Locals Attack CBI Officials) దాడిచేశారు. వారున్న ఇంటికి తాళంవేసి వారిని నిర్బంధించారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గ్రామం నుంచి వారిని సురక్షితంగా తీసుకెళ్లారు.

ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడుతున్న ముఠాలే లక్ష్యంగా సీబీఐ అధికారులు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 77 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఒడిశాలోని దేనకనాల్ జిల్లాకు చెందిన మిథున్‌ నాయక్‌ను అతని ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లారు. నిందితుడిని విచారిస్తుండగా అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సీబీఐ బృందంపై దాడికి దిగారు. వారిపై కర్రలతో దాడి చేశారు. పరిస్థితి విషమించడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు సీబీఐ అధికారులను అక్కడినుంచి పంపించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)