Odisha: పూరీలో ఘోర అగ్నిప్రమాదం, లక్ష్మీ మార్కెట్ కాంప్లెక్స్‌లో అర్థరాత్ర ఒక్కసారిగా ఎగసిన మంటలు, 100 మందిని రక్షించిన అధికారులు
పూరిలో ఉన్న లక్ష్మీ మార్కెట్ కాంప్లెక్స్‌లో (Laxmi Market Complex) బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా కాంప్లెక్స్ మొత్తానికి విస్తరించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.
ఒడిశాలోని (Odisha) పూరిలో ఉన్న ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో (Shopping complex) గత రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. పూరిలో ఉన్న లక్ష్మీ మార్కెట్ కాంప్లెక్స్‌లో (Laxmi Market Complex) బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా కాంప్లెక్స్ మొత్తానికి విస్తరించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కాంప్లెక్స్‌లో చిక్కుకుపోయిన 100 మందిని రక్షించారు (Rescued). గాయపడినవారిని ఆస్పత్రికు తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)