Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, వల్లభనేని వంశీ అనుచరులు అరెస్ట్, టీడీపీ నేత రంగబాడుపై ఎలైట్‌ హోటల్‌ వద్ద దాడికి పాల్పడిన కేసులో అదుపులోకి..

గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన రంగబాబుపై వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్‌ ఎలైట్‌ హోటల్‌ వద్ద దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.పొలం విషయమై మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారని ఫిర్యాదులో రంగబాబు పేర్కొన్నారు

police arrested main followers of former Gannavaram MLA Vallabhaneni Vamsi

వైసీపీ సీనియర్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ( Vallabhaneni Vamsi) ముఖ్య అనుచరులు ఆరుగురుని గన్నవరం పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. ఓలుపల్లి మోహన్ రంగ, భీమవరపు యతేంద్ర రామకృష్ణ (రాము), అనగాని రవి, మేచినేని వెంకటేశ్వరరావు (బాబు), గుర్రం అంజయ్య(నాని) గోనూరి సీనయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ప్రదేశాల్లో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకుని కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

వీడియో ఇదిగో, టీడీపీ సోషల్‌ మీడియాలో వైఎస్‌ జగన్‌పై అసభ్యకర పోస్టులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు

గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన రంగబాబుపై వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్‌ ఎలైట్‌ హోటల్‌ వద్ద దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.పొలం విషయమై మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారని ఫిర్యాదులో రంగబాబు పేర్కొన్నారు. తాజాగా ఈ కేసు విచారణలో కదలిక వచ్చింది. నిందితులను అరెస్ట్ చేసి కంకిపాడు పీఎస్‌కు తరలించి విచారిస్తున్నారు.

police arrested main followers of former Gannavaram MLA 

గతంలో పార్క్ ఎలైట్ హోటల్ వద్ద దాడికి సంబంధించిన సూత్రధారులను వైసీపీ నాయకులుగా గుర్తించిన పోలీసులు. ఈ రోజు ఉదయం వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకుని కంకిపాడు పోలీస్ స్టేషన్‌కి తరలింపు. అదుపులోకి తీసుకున్న వాళ్లలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు... pic.twitter.com/EZqpuLUcW2

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement