Professor-Student Marriage Controversy: విద్యార్థిని క్లాస్‌లోనే పెళ్లి చేసుకున్న లేడి టీచర్, అయితే అది నిజం పెళ్లి కాదని తెలిపిన ప్రొఫెసర్, వీడియో మాత్రం వైరల్

పశ్చిమ బెంగాల్‌లోని హరిన్‌ఘటలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (MAKAUT) సైకాలజీ విభాగంలోని క్లాస్ రూమ్లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులు, లేడీ ప్రొఫెసర్ కు దగ్గరుండి పెళ్లి చేశారు.

representational picture of Hindu wedding. (Photo credits: Pixabay)

పశ్చిమ బెంగాల్‌లోని హరిన్‌ఘటలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (MAKAUT) సైకాలజీ విభాగంలోని క్లాస్ రూమ్లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థులు, లేడీ ప్రొఫెసర్ కు దగ్గరుండి పెళ్లి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో యూనివర్సిటీ యాజమాన్యం విచారణ చేపట్టింది. ఈ ఘటనపై యూనివర్సిటీ ముగ్గురు సభ్యుల విచారణ ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, ప్రొఫెసర్ నుండి వివరణ కోరింది. అయితే ఇది క్లాస్‌లో సైకో డ్రామా అని ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఇది అకడమిక్ ప్రాజెక్ట్‌లో భాగమని, అసలు పెళ్లి కాదని తేల్చి చెప్పారు.

 వీడియో ఇదిగో, దళిత మహిళను కలెక్టర్ కార్యాలయం నుండి ఈడ్చుకుంటూ బయటకు లాక్కెళ్లి పడేసిన పోలీసులు, మండిపడుతున్న నెటిజన్లు

సైకాలజీ డిపార్డ్ మెంట్ ప్రతిష్టనే దిగజార్చడానికి కొందరు వీడియోలను లీక్ చేశారని ప్రొఫెసర్ మండిపడ్దారు.వధువులా దుస్తులు ధరించిన ప్రొఫెసర్ మరియు మొదటి సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి 'సిందూర్ దాన్' మరియు 'మాలా బోడోల్'తో సహా హిందూ బెంగాలీ వివాహానికి సంబంధించిన వివిధ ఆచారాలను క్లాస్‌రూమ్‌లో చేస్తున్నట్లు వీడియోలు చూపించాయి.అయితే విచారణ ముగిసే వరకు సెలవుపై వెళ్లాల్సిందిగా ప్రొఫెసర్‌ను కోరినట్లు అధికారులు తెలిపారు. ఇతర విభాగాలకు చెందిన ముగ్గురు మహిళా అధ్యాపకులతో కూడిన కమిటీ విచారణ జరుపుతోందని వారు తెలిపారు.

 Professor-Student Marriage Controversy: 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement