Rajya Sabha Chairman Mimicry: రాజ్య‌స‌భ చైర్మెన్‌ను వెక్కిరిస్తూ నాటకం,జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌కు ఫోన్ చేసి బాధ‌ను వ్య‌క్తం చేసిన ప్ర‌ధాని మోదీ

మాక్ పార్ల‌మెంట్ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ప్ర‌ధాని అన్నారు

jagadeep dhankar

మాక్ పార్ల‌మెంట్ నిర్వ‌హించడం ద్వారా రాజ్య‌స‌భ చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌(Jagdeep Dhankhar)పై మిమిక్రీ చేసిన విప‌క్ష స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌ను ప్ర‌ధాని మోదీ ఖండించారు. మాక్ పార్ల‌మెంట్ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ప్ర‌ధాని అన్నారు. ఆ ఘ‌ట‌న ప‌ట్ల బాధ‌ను వ్య‌క్తం చేసిన ప్ర‌ధాని.. రాజ్య‌స‌భ చైర్మెన్ జ‌గ‌దీప్‌కు ఫోన్ చేసి త‌న విచారాన్ని తెలిపారు.

మంగ‌ళ‌వారం స‌స్పెండ్ అయిన పార్ల‌మెంట్ విప‌క్ష స‌భ్యులు.. మ‌క‌ర ద్వారం వ‌ద్ద ఉన్న మెట్లపై కూర్చుని చైర్మెన్ జ‌గ‌దీప్‌ను వెక్కిరిస్తూ నాట‌కం వేసిన విష‌యం తెలిసిందే. టీఎంసీ నేత క‌ళ్యాణ్ బెన‌ర్జీ.. చైర్మెన్ జ‌గ‌దీప్ త‌ర‌హాలో న‌టిస్తూ ఆయ‌న్ను అవ‌మానించారు.రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన స్థానంలో ఉన్న ఉప‌రాష్ట్ర‌ప‌తి లాంటి వ్య‌క్తుల‌కు, అది కూడా పార్ల‌మెంట్‌లో అవ‌మానం జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ఫోన్‌లో వెల్ల‌డించిన‌ట్లు ధ‌న్‌క‌ర్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో వెల్ల‌డించారు.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)