PM Modi on Ram Lalla: శ్రీరాముడు ఇప్పుడు గుడిసెలో కాదు, మహా మందిరంలో ఉంటాడు, బాలరాముడి ప్రాణప్రతిష్ట అనంతరం ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘రామ్ లల్లా ఇప్పుడు గుడారంలో ఉండడు.. మహా మందిరంలోనే ఉంటాడు...’ అని అన్నారు. వీడియో ఇదిగో..
ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘రామ్ లల్లా ఇప్పుడు గుడారంలో ఉండడు.. మహా మందిరంలోనే ఉంటాడు...’ అని అన్నారు. ఆ కాలంలో 14 ఏళ్లు మాత్రమే ఎడబాటు... ఈ యుగంలో అయోధ్య, దేశప్రజలు వందల ఏళ్లుగా విడిపోయారు. మన తరాలలో చాలా మంది ఈ వేర్పాటును అనుభవించారు..." శ్రీరాముడి ఉనికిపై న్యాయ పోరాటం దశాబ్దాలుగా కొనసాగింది. న్యాయం చేసినందుకు భారత న్యాయవ్యవస్థకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..."
ఈరోజు నేను కూడా శ్రీరామునికి క్షమాపణలు చెబుతున్నాను. ఇన్ని శతాబ్దాలుగా ఈ పని చేయలేని మన ప్రయత్నం, త్యాగం, తపస్సులో ఏదో లోటు ఉండాలి. ఈరోజు పని పూర్తయింది. భగవంతుడు ఈరోజు మనల్ని తప్పకుండా క్షమిస్తాడని నేను నమ్ముతున్నాను..." అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అపూర్వ ఘట్టమని తెలిపిన ప్రధాని మోదీ, నా జన్మధన్యమైందంటూ..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)