అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ట ప్రతి ఒక్కరినీ భావోద్వేగాలకు గురిచేసే అసాధారణ ఘట్టమని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అన్నారు. "ఈ దివ్య కార్యక్రమంలో భాగం కావడం గొప్ప విశేషమని భావిస్తున్నాను" అని ప్రధాన మంత్రి ఎక్స్‌లో (PM Modi on Ram Lalla Pran Pratishtha) అన్నారు. ఇక్కడి అద్భుతమైన రామాలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు
యావత్ దేశం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న సమయం సంపూర్ణమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి (Ram Lalla) కొలువుదీరాడు. ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అదే సమయంలో జై శ్రీరామ్ నినాదంతో కోట్లాది హిందువులు పులకరించి పోయారు. సకలాభరణలతో అలంకరించిన బాలరాముడు ధనస్సు ధరించి.. కమలంపై కొలువుదీరాడు.
ఆ దివ్యరూపం సోషల్ మీడియాకు చేరగా.. తన్మయంతో భక్తులు పులకరించిపోతున్నారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రుడికి ప్రధాని మోదీ పట్టువస్త్రాలు, వెండి కిరీటం సమర్పించారు. అనంతరం పూజలు నిర్వహించారు. స్వామికి హారతి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌తో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అయోధ్యలో జరిగిన రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'దండ్వత్ ప్రాణం' (తలను నేలను తాకి నమస్కరించడం) నిర్వహించారు.